https://oktelugu.com/

బరువు తగ్గాలని చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు కార్బోహైడ్రేట్‌లను తక్కువ తీసుకుంటారు.

Image Credit : google

దీంతో కొందరు వారి డైట్ నుంచి రోటీని స్కిప్ చేస్తారు. అయితే, ఇకపై ఆ అవసరం లేదు. ఎందుకంటే ఈ టేస్టీ రోటీలను తినడం వల్ల మీరు బరువు పెరగరు. ఇంతకీ అవేంటంటే..

Image Credit : google

 బేసన్ రోటీ : బెసన్ అదేనండి శెనగ పిండితో చేస్తారు. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ & ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది గోధుమ పిండి రోటీకి అద్భుతమైన ప్రత్యామ్నాయం.

Image Credit : google

రాగి రోటీ : బరువు పెరుగుతామని భయపడేవారిలో రాగి ధైర్యాన్ని ఇస్తుంది. రాగి రోటీ డైటరీ ఫైబర్, కాల్షియం, ప్రొటీన్ & ఐరన్‌తో నిండి ఉంటుంది. బరువు తగ్గడానికి అనువైనది.

Image Credit : google

సజ్జ రోటీ : గ్లూటెన్-ఫ్రీ, ఫైబర్-రిచ్ గా ఉండే సజ్జ రోటీ మధుమేహం ఉన్న వ్యక్తులకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది.

Image Credit : google

మల్టీగ్రెయిన్ రోటీ : ఈ రోటీలో శెనగపిండి, రాగులు, జొన్నలు ఉంటాయి. పోషకాలతో నిండిన ఈ రోటీ మీ బరువు తగ్గిస్తుంది.

Image Credit : google

జొన్న రోటీ : జొన్న రొట్టె చాలా మందికి ఇష్టం. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో మెరుగైన సహాయం చేస్తుంది జొన్న రొట్టె.

Image Credit : google

మక్క రోటీ : గోధుమ పిండితో పోలిస్తే తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, మొక్కజొన్న రోటీ ఒక పోషక శక్తి కేంద్రంగా సహాయం చేస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తూనే బరువు తగ్గిస్తుంది.

Image Credit : google

Read more