https://oktelugu.com/

వర్షాకాలం వచ్చింది. వెదర్ కూల్ గా ఉంది. కానీ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అది సరేకానీ ఓ కప్పు టీ తాగాలి అని మాటిమాటికి అనిపిస్తుంటుంది కదా. కానీ ఒక్కసారి అయినా కచ్చితంగా తాగాల్సిందే కదా.

Image Credit : google

వర్షాకాలం వచ్చింది. వెదర్ కూల్ గా ఉంది. కానీ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అది సరేకానీ ఓ కప్పు టీ తాగాలి అని మాటిమాటికి అనిపిస్తుంటుంది కదా. కానీ ఒక్కసారి అయినా కచ్చితంగా తాగాల్సిందే కదా.

Image Credit : google

పసుపు టీ : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పసుపు టీ మీకు చాలా మంచి ఎంపిక. చక్కెరకు బదులు తేనె వాడండి. మరింత మంచిది.

Image Credit : google

అల్లం మసాలా టీ : అల్లం, సాధారణ అందరి ఇంట్లో ఉంటుంది. టీలో కాస్త దంచి వేశారంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. అల్లంతోపాటు ఏలకులు, లవంగం జోడించిన రుచి సూపర్. ఇమ్యూనిటీ పవర్ కూడా హైనే...

Image Credit : google

తులసి టీ : తులసి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. తులసి టీని తయారు చేయడానికి, సాధారణ టీని తయారుచేసే ముందు తులసి ఆకులను ఐదు నిమిషాలు ఉడకబెట్టండి చాలు.

Image Credit : google

క్లాసిక్ మసాలా టీ : క్లాసిక్ మసాలా టీతో మీ రోజును ప్రారంభించడం చాలా మంచిది. అయితే ఈ టీని తులసి, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, నల్ల మిరియాలతో తయారు చేసుకోవాలి.

Image Credit : google

ఫెన్నెల్ టీ :  సోపు మీ టీకి ప్రత్యేకమైన తీపిని జోడిస్తుంది. రుచికరమైన ట్విస్ట్ కోసం టీ ఆకులతో ఫెన్నెల్ ఉడకబెట్టి రెడీ చేసుకోండి.

Image Credit : google

స్టార్ సోంపు టీ : స్టార్ సోంపు మంచి స్మెల్ ను అందిస్తుంది. మీ టీకి కొత్తదనంతో పాటు. రుచికరమైన టీ అనుభవం పొందుతారు.. మరి ఓసారి ట్రై చేస్తారా? ఈ టీలు మొత్తం కూడా మీకు రంగు, రుచి, వాసనతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అని గుర్తు పెట్టుకోండి. 

Image Credit : google