చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఈ సమస్య వస్తుంది. ఇక మగవారిలో బట్టతల మరింత బాధ పెడుతుంది. 

జుట్టు రాలితే కొందరికి తిరిగి వస్తే మరికొందరికి మాత్రం బట్టతల ఉంటుంది. మరి ఈ బట్టతల ఎందుకు వస్తుంది? అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం. 

వంశపారంపర్యంగా పురుషులకు బట్టతల వస్తుంది అంటున్నారు నిపుణులు. మీ తండ్రి, తాతలకు బట్టతల ఉంటే మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 

హార్మోన్ల సమతుల్యత లేకపోయినా బట్టతల వస్తుంది. DHT జుట్టు కుదుళ్లను కుదిస్తుందట. దీని వల్ల జుట్టు రాలుతుందట. 

అధికంగా ఒత్తిడి దీర్ఘకాలంగా ఉంటే కూడా మీకు జుట్టు రాలుతుంది. వ్యాయామం చేయకపోవడం, ధూమపానం వల్ల జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది. 

కొన్ని వైద్య పరీక్షలు, చికిత్సలు పురుషుల్లో బట్టతలకు దోహదం చేస్తాయి అంటున్నారు నిపుణులు. కేమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తాత్కాలిక లేదా శాశ్వత బట్టతలకు దారి తీస్తాయి. 

సరైన ఆహారం తీసుకోవడం వల్ల మీ జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు కూడా. ఆల్ ది బెస్ట్