జుట్టు, చర్మం సౌందర్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. వీటి కోసం అధికంగా ఖర్చు చేస్తారు.

ఖరీదు చేసే ఎన్ని ప్రాడక్టులు వాడినా ఫలితం జీరోనే ఉంటుంది. అందుకే మీకోసం కొన్ని ఇంటి టిప్స్ తీసుకొచ్చాం. లుక్ వేయండి. 

నువ్వుల లడ్డూ. ఇప్పటికే అర్థం అయింది అనుకుంటా.. ఇదొక సూపర్ ఫుడ్ అని.. 

నువ్వుల లడ్డూ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అమ్మాయి మెచ్యూరిటీ అయిన వెంటనే ఈ నువ్వుల లడ్డూను తినిపిస్తారు.

గర్భం, పీరియడ్స్, అందం, ఆరోగ్యం అంటూ అన్నింటిలో తన ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది నువ్వుల లడ్డూ.

ఆడవారి కోసం మాత్రమే పుట్టిన కొన్ని పదార్థాలలో ఈ నువ్వుల లడ్డూను ఒకటిగా చెబుతుంటారు పెద్దలు. 

నువ్వులు, బెల్లం, కుడుకను కలిపి మిక్సీ చేసి లడ్డూ చేస్తారు. కొందరు ఇందులో కుడుకను కలపకుండా సపరేట్ గా చేస్తారు. 

బెల్లం, నువ్వుల్లో ఉండే ఐరన్ చాలా అవసరం.  అందుకే ప్రతి ఒక్కరు ఐరన్ కోసం అయినా ఈ లడ్డూలను తినాలని సలహా ఇస్తున్నారు వైద్యులు.