దక్షిణాఫ్రికాకు ఉత్కంఠ విజయం.. క్వింటన్ డికాక్ అర్థ శతకం, మిగతా బౌలర్ల మెరుగైన బౌలింగ్ సౌత్ ఆఫ్రికా ను ఏడు పరుగుల తేడాతో గెలిచేలా చేసింది.

విలువైన భాగస్వామ్యం బ్రూక్, లివింగ్ స్టోన్ ఐదో వికెట్ కు 79 పరుుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

రబాడా మ్యాజిక్.. 18 ఓవర్లో లివింగ్ స్టోన్ ఔట్ చేయడం, మార్కోస్ జాన్సన్, అన్రిచ్ నార్టేజే చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 

అదరగొట్టిన ఫీల్డింగ్ .. హెండ్రిక్స్, క్లాసెన్, నోర్ట్జీ, కేశవ్ మహారాజ్, స్టబ్స్, మార్క్రం వంటి వారి ఫీల్డింగ్ సౌత్ ఆఫ్రికాను గెలిపించింది.

ఇంగ్లాండ్ వృధా పోరాటం.. బట్లర్, బెయిర్ స్టో, సాల్ట్, మొయిన్ అలీ వంటి ఆటగాళ్లు విఫలమయ్యారు

బ్రూక్, లివింగ్ స్టోన్ అదుర్స్ ,, 61/4 వద్ద ఉన్న ఇంగ్లాండ్ జట్టును బ్రూక్, లివింగ్ స్టోన్ 17.2 ఓవర్ల వద్ద 139 దాకా తెచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

అక్కడే ఆగిపోయింది.. 17.2 ఓవర్ లో 33 రన్స్ చేసి లివింగ్ స్టోన్. 19.1 ఓవర్ లో 53 రన్స్ వద్ద బ్రూక్ ఔటయ్యారు. దీంతో ఇంగ్లాండ్ 156/6 వద్ద ఆగిపోయింది.

వ్యూహాత్మక బౌలింగ్,, సౌత్ ఆఫ్రికా వ్యూహాత్మక బౌలింగ్ అమలు చేసి.. గెలుపు ముంగిట ఇంగ్లాండ్ ను చావు దెబ్బ కొట్టింది