ముఖ్యంగా అక్కినేని నాగార్జున షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కనిపించిన తర్వాత సిరి హనుమంత్ విస్తారమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది
ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హాస్య వీడియోలు , అందమైన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరించింది.
గత సంవత్సరం బిగ్ బాస్ తెలుగు 5లో నాల్గవ రన్నరప్‌గా నిలిచిన తర్వాత సిరి ఈ సంవత్సరం ఆహా సిరీస్ #BFFతో OTT అరంగేట్రం చేసింది.
ఈ సిరీస్ అడల్టింగ్‌కు రీమేక్, ఇందులో ఐషా అహ్మద్, యశస్విని దయామా నటించారు. ఆహా ఒరిజినల్ స్ట్రీమింగ్ మే 20న ప్రారంభమైంది.
సిరి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటుంది. తన వ్యక్తిగత, ఫ్యాషన్ ఫొటోలను పంచుకుంటుంది.
తాజాగా నల్లని షార్ట్ వేసుకొని మెరిసే ఆకుపచ్చ టాప్ ధరించి హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలకు కలలు కనే వాతావరణాన్ని జోడిస్తూ బ్యాక్‌గ్రౌండ్ మెరిసే లైట్లతో నింపేసింది.
సిరీ అందాల ఫొటోలకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏం అందంరా అని కొనియాడుతున్నారు.