అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఫోన్ మన ప్రపంచంలో మనల్ని ఉండనివ్వడం లేదు. అందరూ కాకున్నా చాలా మంది దీని మాయలో పడిపోయారు.  అయితే మీరు కూడా అడెక్ట్ అయిపోయారా లేదా చెక్ చేసుకోండి.

నిమగ్నత: వాట్సప్ లో మెసేజ్ వచ్చిందా? ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు వచ్చాయా? లైక్ లు కామెంట్లు ఏం వచ్చాయి అంటూ నిరంతరం అవసరం లేని వాటిని వెతుకుతున్నారంటే మీరు ఫోన్ కు అడెక్ట్ అయినట్టేనట.

సమయం: ముందు కంటే ఇప్పుడు ఎక్కువ సేపు ఫోన్ కు కేటాయిస్తున్నారా? అయితే మరింత లోతుగా ఫోన్ లోకి కూరుకొని పోయినట్టే.

ఉపసంహరణ: ఆన్‌లైన్‌లో లేకున్నా విశ్రాంతి లేకపోవడం, చిరాకు లేదా నిరాశ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి మానసిక స్థితి, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మీరు సామాజికంగా ఒంటరితనానికి దగ్గర అవుతున్నట్టే.

నిర్లక్ష్యం: ఆన్‌లైన్‌లో ఉండటానికి ముఖ్యమైన పనులు, ఇతర ఈవెంట్ లకు వెళ్లడం లేదంటే మీ జీవితాన్ని ఫోన్ కు అంకితం ఇచ్చేసినట్టే. దీని వల్ల మీ లైఫ్ నే మీరు మిస్ అవుతారు.

అబద్ధం: ఆన్ లైన్ కోసం అబద్ధాలు కూడా చెబుతుంటారు. ఏదైనా పని చెప్పినా, నెట్ గురించి అడిగినా మీరు అబద్దాలు చెబుతున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే.. ఫోన్ తోనే ఇక మీ జీవితం అనుకుంటున్నట్టు..

తప్పించుకోవడం: ఒత్తిడి, అపరాధం, ఆందోళన లేదా నిరాశ నుంచి ఉపశమనం పొందడానికి ఆన్‌లైన్‌కి వెళ్తుంటారు కొందరు. అంటే మనషుల కంటే మీరు ఆన్ లైన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు..

ఈ అలవాట్లు మీకు ఉంటే వెంటనే వీటిని మానుకోండి. బాత్రూమ్ కు వెళ్లినా ఫోన్ తీసుకొని పోయేంతల మీ లైఫ్ కు ఫోన్ వస్తే దాన్ని తగ్గించడం ఉత్తమమే కదా. సో ఆల్ ది బెస్ట్..