ఇప్పటికీ తమ గ్లామర్‌ను మెయింటెయిన్ చేస్తూ, వయసుకు తగ్గ వైబ్స్‌ని అందిస్తున్న అతికొద్ది మంది నటీనటుల్లో శ్రియా శరణ్ ఒకరు.

41 ఏళ్ల శ్రీయ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆమె క్లాస్సి , సొగసైన  డ్రెస్సులో కనువిందు చేసింది.

నటి హైదరాబాద్ టైమ్స్ అవార్డ్స్ వేడుకకు హాజరై అందరి దృష్టిని తనవైపు ఆకర్షించింది.

పింక్ కలర్ చీరను మ్యాచింగ్ నిట్-వేర్ బ్లౌజ్‌తో ధరించి, నటి అద్భుతంగా కనిపించింది.

"మీరు నన్ను జయించగల ఏకైక మార్గం ప్రేమ ద్వారానే.. మీ ప్రేమతోనే నేను సంతోషంగా ఉండగలుగుతాను" అని రాస్తూ ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ శ్రియ రాసింది.

"మీ అందాన్ని కాంతిగా మారడం కోసం వేచి ఉండకండి," అంటూ మరొక ఫొటోకు క్యాప్షన్‌గా పంచుకుంది.

శ్రియ చివరిగా మ్యూజిక్ స్కూల్‌లో కనిపించింది.