దక్షిణాఫ్రికా జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి షెఫాలీ వర్మ అదరగొట్టింది. 20 ఏళ్ల షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ చేసింది. 

194 బంతుల్లో డబుల్ వన్డే తరహా బ్యాటింగ్ చేసిన షెఫాలీ వర్మ.. 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించింది.. మొత్తంగా 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో 205 పరుగులు చేసింది.

సదర్ ల్యాండ్ రికార్డ్ బద్దలు ఇప్పటివరకు వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఆస్ట్రేలియా క్రీడాకారిణి అన్నాబెల్ సదర్ ల్యాండ్ పేరు మీద ఉండేది. సౌత్ ఆఫ్రికా పై 248 బంతుల్లో సదర్ ల్యాండ్ ఈ ఘనత సాధించింది. 

22 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది టీమిండియా తరఫున 22 సంవత్సరాల క్రితం అప్పటి కెప్టెన్ మిథాలీ రాజ్ ఇంగ్లాండ్ జట్టుపై 407 బంతుల్లో 214 పరుగులు చేసింది. చివరికి ఇన్నేళ్ల తర్వాత వర్మ ఆ రికార్డును బ్రేక్ చేసింది.

రికార్డు స్థాయి భాగస్వామ్యం 22 ఏళ్ల క్రితం నాటి రికార్డును  షెఫాలీ వర్మ బద్దలు కొట్టింది.. స్మృతి మందాన తో కలిసి 292 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

దురదృష్టవశాత్తు రనౌట్ మరింత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న వర్మ జెమీమా రోడ్రిగ్స్ తో సమన్వయ లోపం కారణంగా రన్ అవుట్ అయింది. లేకుంటే త్రిబుల్ సెంచరీ సాధించేదేమో..

స్మృతి మందాన తోడైంది వర్మకు తోడుగా స్మృతి మందాన (149) కూడా దూకుడుగా ఆడింది. సెంచరీ చేసి ఆకట్టుకుంది. అయితే ఆమె కూడా దురదృష్టవశాత్తూ ఆమె అవుట్ అయింది.