Image Credit : pexels
Image Credit : pexels
మీ పిల్లల లంచ్‌బాక్స్‌తో హెడ్ ఎక్ వస్తుందా? బోరింగ్ భోజనాలకు వీడ్కోలు చెప్పండి! లంచ్‌టైమ్‌ను ఉత్తేజంగా ఆరోగ్యకరంగా రెడీ చేయండి. ఇంతకీ ఎలా అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.
Image Credit : pexels
ఓట్స్ ఇడ్లీ : ఓట్స్, కాయధాన్యాలు, కూరగాయలతో ఇడ్లీలను తయారు చేసుకోవాలి. మినరల్స్, విటమిన్లు, ప్రొటీన్లతో నిండిన ఈ ఓట్ల్స్ ఇడ్లీలను పిల్లలు ఇష్టపడుతూ మరీ తింటారు.
Image Credit : pexels
పెసరపప్పు వడలు, చపాతీ : ఆరోగ్యకరమైన పెసరపప్పు వడలు, లేదా చపాతీలలో నాణ్యమైన ప్రోటీన్లు, పోషకాలు ఉంటాయి. ఇవి టేస్ట్ గా ఆరోగ్యకరంగా మీ పిల్లల లంచ్ ను ముగిస్తాయి.
Image Credit : pexels
సేమ్యా ఉప్మా : ఉప్మా తినాలి అనిపించదు. కానీ చాలా మంది సేమ్యా ఉప్మా ను ఇష్టంగా తింటారు. అందులో కొన్ని కూరగాయలు వేసి ఇస్తే మరింత ఆరోగ్యకరం. మంచి లంచ్ కూడా రెడీ.
Image Credit : pexels
ఎగ్ ఫ్రైడ్ రైస్ : ఎగ్ ఫ్రైడ్ రైస్ ను కూడా మీ పిల్లలు ఇష్టంగా తింటారు. గుడ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రైస్ తో కలిసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి.. స్పైసీ సాస్‌లతో తింటే సూపర్ గా ఉంటాయి.
Image Credit : pexels
లెమన్ రైస్ : లెమన్ రైస్ ను ఎవరైనా ఇష్టంగా తింటారు. చాలా ఫాస్ట్ గా అవుతుంది. మరి పోషకాల సంగతేంటి అనుకుంటున్నారా? ఇందులో కాస్త క్యారెట్, బీట్రూట్ లేదా ఇతర కూరగాయలు కలిపి ప్రిపేర్ చేయండి.
Image Credit : pexels
రాగి పాన్కేక్ : పోషకాలు నిండిన రాగితో పాన్‌కేక్‌లు చేసుకోవచ్చు. ఇందులో కాల్షియం, ఐరన్ నిండి ఉంటుంది. ఏ సమయంలో అయినా సరే వీటిని తింటే మీకు చాలా రుచిగా అనిపిస్తుంటుంది.
Image Credit : pexels
ఆలూ పరాటా : అహా సూపర్ టేస్ట్ గా ఉంటాయి. ఇక పిల్లలకు మరింత ఎక్కువ నచ్చుతాయి. ఆలూ పరాటా ఆరోగ్యంతో పాటు రుచిని అందిస్తుంది.