ఫిదా సినిమాతో ఫిదా చేసింది బ్యూటీ సాయి పల్లవి. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఫిదా సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ సెలెక్ట్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది ఈ బ్యూటీ.

గతంలో ఈమె ఇక సినిమాలు మానేస్తుందని.. తనకు ఇష్టమైన డాక్టర్ వృత్తిలో మాత్రమే కొనసాగుతుందంటూ కామెంట్లు కూడా వచ్చాయి.

వీటిని కొట్టిపారేస్తూ మంచి పాత్రలు వస్తే సినిమాలు చేస్తాను అంటూనే ఇప్పుడు రామాయణంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది.

రణబీర్ కపూర్ రాముడిగా, సీత పాత్రలో సాయి పల్లవి కలిసి నటించనున్నారు. ఈ సినిమా పనులు మొదలయ్యాయి.

రీసెంట్ గా సీత లుక్ లో సాయి పల్లవి కనిపిస్తే ఆమె అభిమానులు ముచ్చట పడ్డారు. ఇక ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో..

అమ్మడు చేసిన సినిమాల్లో హిట్లు ఎక్కువ. ఫ్లాప్ లు తక్కువ. మంచి రిజల్ట్ తో ముందుకు వెళ్తుంది సాయి.

సంప్రదాయంగా తెలుగింటి అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ.. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటుంది.