రోహిత్.. ఇలాగైతే కష్టమే.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

Images source: google

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరియర్ లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురవుతున్నాడు.

Images source: google

టి20 వరల్డ్ కప్ లో మెరుగ్గా రాణించినప్పటికీ.. ఆ తర్వాత అతడు తన పూర్వపు లయను కోల్పోయాడు. కివీస్ తో సిరీస్లో దారుణమైన ప్రదర్శన చేశాడు.

Images source: google

రోహిత్ వైఫల్యం జట్టు విజయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్ 0-3 తేడాతో ఓడిపోవడంలో అది ప్రధాన కారణం.

Images source: google

స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై 13.30 సగటుతో 10 ఇన్నింగ్స్ లలో కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు.

Images source: google

స్వదేశంలో టాప్ -7 లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. రెండవ అత్యంత స్వల్ప సగటు నమోదు చేసిన కెప్టెన్ గా నిలిచాడు.

Images source: google

2000 సంవత్సరంలో ఇంగ్లాండ్ వేదికగా ఆరు టెస్టులు ఆడి.. 10.22 సగటు నమోదు చేసిన కెప్టెన్ గా నాసిర్ హుస్సేన్ నిలిచాడు.

Images source: google

2010/11 లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్ స్వదేశంలో 16.14 సగటు మాత్రమే నమోదు చేశాడు. ఇతడి కంటే రోహిత్ సగటు తక్కువగా ఉంది.

Images source: google

రోహిత్ దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. అతడి పై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

Images source: google