Image Credit : pexels
Image Credit : pexels
ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నదంటే పూర్వకాలంలో పెద్దలు నిర్మించిన ప్రాజెక్టుల పుణ్యమేనని అనుకోవాలి. అయితే ప్రాజెక్టులు లేని కాలంలో బావులు తవ్వుకొని నీటిని తీసుకునేవారు.
Image Credit : pexels
బావి అనగానే దాదాపు సర్కిల్ లో ఉంటుంది. కొన్ని బావులను సిమెంట్ తో కూడిన గాజుతో నిర్మిస్తారు. ఒకప్పుడు ఇవి ఉండేవి కావు. కానీ వర్షాకాలంలో నీటి తాకిడికి బావులు పూడుకుపోయేవి.
Image Credit : pexels
అందువల్ల ఈ గాజులను నిర్మించి కూలిపోకుండా కాపాడుకున్నారు. అయితే గుండ్రంగానే ఎందుకు నిర్మించాలి? అని అనేవాళ్లు లేకపోలేదు. బావిని పురాతన కాలం నుంచి గుండ్రంగానే నిర్మిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇవి సర్కిల్ లాగే ఉంటాయి.
Image Credit : pexels
ఇలా ఉండడానికి ప్రధాన కారణం ఉంది. బావి గుండ్రంగా ఉంటే నీటి పీడనం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ నీరు ఉబికి వస్తుంది.
Image Credit : pexels
చతురస్రాకారంలో ఉండడం వల్ల నీరు ఎక్కువగా పైకి రాకుండా ఉంటుంది. దీంతో తోడుకోవడానికి కష్టంగా ఉంటుంది. గుండ్రంగా ఉండడం వల్ల నీరు తొందరగా పైకి వస్తుంది.
Image Credit : pexels
అలాగే బావి గుండ్రంగా తవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారంలో తవ్వడం కష్టంగా ఉంటుంది. అందువల్ల బావులు ఎక్కువ శాతం గుండ్రంగా ఉంటాయి.
Image Credit : pexels
అయితే వ్యవసాయ బావులు మాత్రం కొన్ని భిన్నంగా ఉంటాయి. ఇవి అక్కడ భూగర్భ జలాల ఆధారంగా తవ్వుతూ ఉంటారు. అందువల్ల గుండ్రంగా కనిపించవు.
Image Credit : pexels
అంతేకాకుండా గుండ్రంగా ఉండడం వల్ల రైతులకు అనుకూలంగా ఉండదు. చేద బావులు కచ్చితంగా గుండ్రంగా ఉంటాయి. నేటి కాలంలో బావులు తక్కువ అవుతున్నాయి. అందరూ బోర్ వెల్ ను ఉపయోగించడం వల్ల బావులు కనిపించడం లేదు.