శాకాహారాన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అన్ని విటమిన్లు, ప్రొటీన్లు తీసుకోవడం విషయంలో మాత్రం కచ్చితంగా జాగ్రత్త వహించాలి.  శాఖాహారం వల్ల ఉన్న కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం

Image Credit : google

మెరుగైన జీర్ణక్రియ : శాకాహార ఆహారంలో అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.  డైవర్టిక్యులైటిస్ వంటి జీర్ణ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Credit : google

బరువు : శాకాహారం వల్ల తక్కువ కేలరీలు మాత్రమే పొందుతారు. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

Image Credit : google

గుండె ఆరోగ్యం : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు సమృద్ధిగా ఉన్న శాకాహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మెరుగైన గుండె ఆరోగ్యం మీ సొంతం.

Image Credit : google

తక్కువ క్యాన్సర్ ప్రమాదం : వివిధ రకాల మొక్కల ఆధారిత ఆహారాలను తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైటోకెమికల్స్ అందుతాయి. ఇవి కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి రక్షిస్తాయి.

Image Credit : google

మెరుగైన దీర్ఘాయువు : అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, కిడ్నీ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధుల భయం తక్కువ ఉంటుంది. మాంసాహారులతో పోలిస్తే శాఖాహారులు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image Credit : google

విటమిన్ డి లేకపోవడం : ఇది సూర్యకాంతి వల్ల కూడా లభిస్తుంది. అయితే శాకాహారులకు విటమిన్ డి వారి ఆహారంలో తక్కువే లభిస్తుందట. విటమిన్ డి ఆహారాలు లేదా సప్లిమెంట్లను తీసుకోవాలట. సూర్యకాంతికి కాసేపు అయినా నిల్చోవాలి.

Image Credit : google

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపం : చేపలలో ప్రధానంగా కనిపించే ఒమేగా-3 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. అవిసె గింజలు, వాల్‌నట్‌లు వంటి వాటిలో మాత్రమే ఒమేగా-3 ఆమ్లాలు లభిస్తాయి. కాబట్టి తెలుసుకొని తినాల్సిందే.

Image Credit : google