రష్మిక మందన్న ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్ 'యానిమల్'లో తన అసాధారణమైన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. రణబీర్ కపూర్‌తో స్క్రీన్‌ను పంచుకుంది.

సినిమా విజయం కేవలం సినిమా రంగానికే పరిమితం కాదు, బాక్సాఫీస్ కలెక్షన్లు దూసుకుపోతూ, రికార్డులను బద్దలు కొడుతూనే ఉన్నాయి.

రష్మిక ఈ దెబ్బతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయింది.

ఇటీవల 40 మిలియన్ల మంది ఫాలోవర్స్ మైలురాయిని అధిగమించిన రష్మిక కొన్ని హాట్, ఆకట్టుకునే ఫొటోలను తాజాగా పంచుకుంది. తన అంకితభావ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

సొగసైన చోకర్, చిక్ పోనీటైల్ , పింక్ లిప్‌స్టిక్‌తో ఆకర్షణీయమైన క్రీమ్-రంగు చీరలో కనిపించి.. క్యూట్‌నెస్‌ని వెదజల్లింది.