స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఫేమ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ బుల్లితెర స్టార్ గా వెలిగిపోతున్నారు.

 స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్ అనుభవిస్తున్నారు. లెజెండరీ కామెడీ షో జబర్దస్త్ ఈమె ఫేట్ మార్చేసింది.

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్ కి బ్రేక్ రాలేదు.

ఆమెకు సపోర్టింగ్, వ్యాంప్ రోల్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ మాత్రమే దక్కాయి.

ఏళ్ల పాటు హీరోయిన్ ఆఫర్ కోసం ఎదురుచూసిన రష్మీ గౌతమ్ యాంకర్ గా మారారు.

జబర్దస్త్ ఇచ్చిన ఫేమ్ రష్మీని హీరోయిన్ ని చేసింది. గుంటూరు టాకీస్, అంతకు మించి, నెక్స్ట్ నువ్వే ఇలా పలు చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించింది.

బుల్లితెర మీద రాణిస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ షోలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఒలకబోస్తుంది. తాజాగా చల్లగాలి అందాలు ఆరబెట్టుకుంది.

అమ్మడు క్రేజీ ఫోజులు మతులు పోగొడుతుంటే, కుర్రాళ్ళు కుదురుగా ఉండలేకున్నారు. రష్మీ అందాలను కామెంట్స్ రూపంలో పొగుడుతున్నారు. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.