రుతుపవనాలు వేసవి వేడి నుంచి ఉపశమనాన్ని అందజేస్తాయి. కానీ తేమ స్థాయిలను కూడా పెంచుతాయి.

తేమ వల్ల జిగట, అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి.

మరి వర్షాకాలం మొదలైంది కదా.. అంటువ్యాధులు రాకుండా ఏం చేయాలో చూసేద్దాం.

తేలికపాటి దుస్తులు : గాలిలోని తేమ ఫాబ్రిక్‌లోకి వెళ్లి చెమట పట్టేలా చేస్తుంది. అందుకే కాటన్ వంటి తేలికైన, శ్వాసక్రియకు అనుకూలమైన బట్టలు ధరించండి.

చర్మ సంరక్షణ : తేలికైన మాయిశ్చరైజర్లను ఉపయోగించండి. ఇవి త్వరగా చర్మంలోకి వెళ్తాయి. మృత చర్మ కణాలను తొలగించి మూసుకొని పోయిన రంధ్రాలు ఓపెన్ అయ్యేలా ప్రయత్నించండి

తలస్నానం : తేమ వల్ల జుట్టులో జిడ్డు ఏర్పడుతుంది. దీనివల్ల తలలో దురద వస్తుంది. మీ తలని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తలస్నానం చేయాలి.

హైడ్రేటెడ్ గా ఉండాలి : పుష్కలంగా ద్రవాలు, నీరు తాగాలి, ఎందుకంటే హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం చల్లబడుతుంది. రుతుపవనాల వేడిని ఎదుర్కోవడంలో నీరు సహాయపడుతుంది.

పరిశుభ్రత పాటించండి : బ్యాక్టీరియా పెరుగుదల, చర్మం చికాకుగా ఉండకూడదు అంటే తాజా దుస్తులు ధరించాలి.. దీనివల్ల తాజా అనుభూతి వస్తుంది.