తేమగా ఉండే వర్షాకాలంలో ఈగలు, దోమలు, కీటకాలు ఇంట్లో తాండవం చేస్తుంటాయి.

ఈ సీజన్ లో ఇల్లు వీలైనంత నీట్ గా ఉంచుకోవాలి. చెత్తచెదారం ఉంటే వాటి మీద వాలిన దోమలు ఆహారం మీద వాలుతాయి. తద్వారా వ్యాధులు వస్తాయి.

ఆహారం మీద మూతలు పెట్టడం, ఇల్లు ఎంట్రీ పాయింట్లు అంటే కిటికీలు, డోర్స్ క్లోజ్ చేసి ఉంచాలి. వీటికి సన్నని జాలీలను అమర్చాలి.

ఇంటి చుట్టూ ఏమైనా ఖాళీలను ఉంటే వాటిని సిలికాన్ సీలెంట్ లేదా ఇతర సీలింగ్ లతో కవర్ చేయాలి.

నీరు నిల్వ ఉంటే వాటిని తొలగించాలి. కుండీలు వంటివి తీసేయడం మంచిది. లేదంటే దోమలు పెరుగుతాయి. ఇంటి బయట కూడా చెత్త ఉంచకూడదు.

యాపిల్ సైడర్ వెనిగర్, డిష్ సోప్ కలపి లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఇందులోని వెనిగర్ ఈగలను ఆకర్షిస్తుంది. ఇక ఈగలు ఈ లిక్విడ్‌లో మునిగి చనిపోతాయి.

సహజ కీటక నాశకాలను వాడాలి. కానీ విషపూరిత రసాయనాలు వాడవద్దు. వేపనూనె కీటకాలను తరిమేస్తుంది. నీమ్ ఆయిల్‌ను నీటిలో కలిపి కిటికీలు, తలుపులు, ఇతర ప్రాంతాల దగ్గర స్ప్రే చేస్తే సరిపోతుంది.

ఈగలు, దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో నిమ్మకాయ ముక్కలు, లవంగాలు కలిపి ఉంచాలి. పుదీనా, లావెండర్, యూకలిప్టస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కీటకాలను నాశనం చేస్తాయి.