రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి భారీ వసూళ్లను సాధించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి భారీ వసూళ్లను సాధించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

మన దగ్గర ఈ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ పడడానికి మరికొద్ది గంటలు సమయం ఉన్నప్పటికీ యుఎస్ఎ లో మాత్రం ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ను వేశారు

 ఈ సినిమాను చూసిన ప్రభాస్ యూఎస్ అభిమానులు ఈ సినిమా గురించి ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

ఈ సినిమా స్టోరీ ఒకెత్తూ అయితే, స్క్రీన్ ప్లే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ సినిమాలో ఒక హై ఎమోషన్ ను ఇచ్చి వదిలారని చెబుతున్నారు.

 నాగ్ అశ్విన్ తెరకెక్కించిన  విధానం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందట.

విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందని అక్కడి అభిమానులు చెబుతున్నారు.

దీపిక పదుకొనే ఇంతవరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించిందట.  సినిమాను చూసిన ప్రతి ఒక్క అభిమానిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెబుతున్నారు.

ప్రభాస్ ఒక్కడు ఒకవైపు నిల్చుంటే.. మరోవైపు అమితాబచ్చన్ కమలహాసన్ ఈ సినిమాని వాళ్ల భుజాల మీద మోసుకెళ్లినట్టుగా కూడా చెబుతున్నారు.