ధర్మ పరిరక్షణ... ప్రజా క్షేమం ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు   పవన్ కళ్యాణ్  యాగం నిర్వహిస్తున్నారు.

రుత్వికుల వేద ఘోషతో మంగళగిరి జనసేన కార్యాలయం కొనసాగుతోంది.

తొలుత విఘ్నాధిపతి గణనాధుని అర్చన, అంకురార్పణతో యాగం ప్రారంభం కాగా, తదనంతరం ఆవాహనాది విశిష్ట కలశ స్థాపన సహిత దేవతాహ్వాన పూజ ప్రారంభమైంది.

దేవతాలంకార అస్త్రాలకు పవన్ కళ్యాణ్ ప్రణతులు సమర్పించారు.

గణపతి పూజ, అంకురార్పణ సమయంలో ధవళ వస్త్రాలు ధరించిన పవన్ కళ్యాణ్ దేవతా ఆవాహన క్రతువులో కుంకుమ వర్ణ వస్త్రాలను ధరించారు.

ఉత్సవమూర్తులను పూజా పీఠంపై అధిష్టింప చేసిన తర్వాత తత్ దేవాతా ధ్యానవాహనాది షోడశోపచార పూజాసహిత మంత్ర పంచాగ విధాన అనుష్టానం ఆరంభించారు.

ఇందులో భాగంగా జప, తర్పణ, పారాయణ, హోమ, అభిషేకాలను రుత్వికులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు.