అందంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందం కోసం నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి కొన్ని శతాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నారు ప్రజలు.

మాయిశ్చరైజర్: నెయ్యిని చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. ఇందులోని కొవ్వు ఆమ్లాలు పొడిచర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మొహానికి కాస్త నెయ్యిని అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయండి.

పెదవి: మృదువైన పెదాల కోసం కాస్త నెయ్యిని తీసుకొని పెదాల మీద అప్లే చేయండి. కాస్త మసాజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.

హెయిర్ కండీషనర్: మంచి కండీషనర్ నెయ్యి. కాస్త వేడి చేసి తలకు, జుట్టుకు అప్లైచేసి, గంటపాటు ఉంచి, ఆపై షాంపూతో కడగాలి. జుట్టు, స్కాల్ప్ పోషణకు సహాయ పడుతుంది, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

వృద్ధాప్య ఛాయలు: నెయ్యిలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను ఎదుర్కోవడానికి సహాయ పడతాయి. ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

కంటికి: నల్లటి వలయాలు, కంటి కింద ఉబ్బు తగ్గడానికి, పడుకునే ముందు కళ్ల కింద కాస్త నెయ్యి రాయండి. ఇందులోని పోషక లక్షణాలు కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.

ఫుట్ క్రీమ్: ఎండిపోయిన, పగిలిన మడమల కోసం, పడుకునే ముందు మీ పాదాలకు నెయ్యి రాసి, సాక్స్ వేసుకుని, రాత్రంతా అలాగే వదిలేయండి. దీని వల్ల చాలా స్మూత్ గా అవుతాయి.

మేకప్ రిమూవర్:  నెయ్యిని మేకప్ రిమూవర్‌గా ఉపయోగించవచ్చు. దీన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత క్లాత్ తో తుడవాలి. ఇది చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచడంలో సహాయం చేస్తుంది.