ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన వారికి ‘ఆరెంజ్ క్యాప్’ను చివర్లో ప్రదానం చేస్తారు. గడిచిన దశాబ్ధంలో ఎవరు ఈ పరుగుల వీరులో తెలుసుకుందాం..

2014 : కోల్ కతా నైట్ రైడర్స్ తరుఫున అత్యధికంగా 660 పరుగులు చేసిన రాబిన్ ఉతప్పకు 2014లో ఆరెంజ్ క్యాప్ దక్కింది..

2015 : సన్ రైజర్స్ తరుఫున ఆడిన డేవిడ్ వార్నర్ 562 పరుగులతో ఈ సంవత్సరం ఆరెంజ్ క్యాప్ సాధించాడు

2016: ఆర్సీబీ తరుఫున ఆడిన విరాట్ కోహ్లీ ఏకంగా ఈ సీజన్ లో 973 పరుగులు దంచికొట్టి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు

2017 : సన్ రైజర్స్ తరుఫున ఆడిన డేవిడ్ వార్నర్ 641 పరుగులతో సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యారు..

2018 : సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా నియామకమైన కేన్ విలయంసన్ 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు

2019 : సన్ రైజర్స్ తరుఫున ఆడిన డేవిడ్ వార్నర్ 692 పరుగులతో ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ సాధించాడు.

2020 : పంజాబ్ కింగ్స్ తరుఫున ఆడిన కేఎల్ రాహుల్ 670 పరుగులతో ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ కొట్టాడు

2021 : 635 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వైడ్ ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ సాధించాడు

2022 : 863 పరుగులతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ ఒడిసిపట్టాడు.

2023 : గుజరాత్ టైటాన్స్ తరుఫున ఆడిన శుభ్ మన్ గిల్ 890 పరుగులతో గత ఏడాది టాపర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సాధించాడు.

Off-white Banner

Thanks For Reading...