https://oktelugu.com/

ఐదు రింగులు.. ఐదు రంగులు వేటికవే ప్రత్యేకం.. ఇచ్చే బంగారు పతకం గోల్డ్ కాదు.. 

ఒలిపింక్స్ వెనుక ఉన్న ఈ ఆసక్తికర సంగతులు మీకు తెలుసా?

Image Credit : google

Image Credit : google

ప్రతి నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ జరుగుతాయి. దీనిని ప్రపంచ క్రీడా వేడుక అని పిలుస్తారు. జూలై 26 నుంచి పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈసారి భారత జట్టు తరఫున 117 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ..

Image Credit : google

ఒలంపిక్ లోగోలో ఐదు వృత్తాలు ఉంటాయి. ఇది వేరువేరు రంగుల్లో ఉంటాయి. ఈ రంగులు ఓసియానా, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాలకు ప్రతీకలు. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ప్రతి దేశపు జాతీయ జెండాలను ప్రతిబింబిస్తుంటాయి.

Image Credit : google

ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి వందరోజుల ముందుగానే గ్రీస్లోని ఒలింపియా ప్రాంతంలో వేడుకలు జరుగుతాయి. ఆ ప్రాంతంలో ఒలింపిక్ టార్చ్ ను వెలిగిస్తారు. విశ్వ క్రీడలు ముగిసే వరకు ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది.

Image Credit : google

చరిత్ర ప్రకారం తొలి ఒలింపిక్ క్రీడలు క్రీస్తుపూర్వం 776 లో ప్రారంభమయ్యాయి. గ్రీకు సంప్రదాయం ప్రకారం ఆరు నెలల ఈ క్రీడలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రెజ్లింగ్, బాక్సింగ్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, రధాలు, డిస్కస్ వంటి విభాగాలలో పోటీలు నిర్వహించారు.

Image Credit : google

ఒలింపిక్ పోటీలు క్రీస్తుశకం 393లో నిషేధానికి గురయ్యాయి. ఆ తర్వాత 1500 సంవత్సరాల అనంతరం ఆధునిక ఒలింపిక్స్ పేరుతో 1896లో మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. 

Image Credit : google

ప్రారంభంలో సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించేవారు. ఆ తర్వాత వింటర్ ఒలింపిక్స్ కూడా మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం సమ్మర్ ఒలింపిక్స్ పూర్తయిన రెండేళ్ల అనంతరం వింటర్ ఒలింపిక్స్ జరుపుతున్నారు. 

Image Credit : google

ఒలింపిక్స్ కేవలం సమ్మర్, వింటర్ మాత్రమే కాకుండా దివ్యాంగుల కోసం పారా ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు యూత్ ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తున్నారు. 

Image Credit : google

ఒలింపిక్స్ క్రీడల్లో విజేతలకు గోల్డ్ మెడల్ పూర్తి బంగారంతో చేసింది కాదు. 1912 వరకు పూర్తి బంగారంతో తయారుచేసిన మెడల్ విజేతకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పతకంలో కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే వాడుతున్నారు. మిగతాది మొత్తం సిల్వర్ లేదా రీసైకిలింగ్ చేసిన మెటల్స్.