హార్మోన్ల మార్పులు, పర్యావరణ కారకాలు, జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. వీటివల్ల మొటిమలు, పొడిబారడం, మంట, వంటివి వస్తుంటాయి. మరి ఇవి రాకుండా డైలీ లైఫ్ లో ఏం చేయలంటే..

Image Credit : google

ప్రతి రోజు మొహాన్ని రెండు సార్లు కడగాలి. దీని వల్ల నూనె, మురికి వంటివి తొలిగిపోతాయి. లేదంటే నూనె దుమ్మధూళి వంటివి రంధ్రాలను మూసుకొని పోయేలా చేస్తాయి. దీంతో చర్మ మొటిమలు వస్తాయి. 

Image Credit : google

హైడ్రేషన్ : పుష్కలంగా నీరు త్రాగడం వల్ల మీ చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ గా ఉంచుతుంది, పొడిబారకుండా చేస్తుంది. అందుకే రోజుకు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. 

Image Credit : google

ఆరోగ్యకరమైన ఆహారం : పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారం చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలను అందిస్తుంది. అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాల జోలికి వెళ్లకండి.

Image Credit : google

ధూమపానం, మద్యపానం : ధూమపానం వల్ల వృద్దాప్య ఛాయలు త్వరగా వస్తాయి. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గించి తేజం లేకుండా చేస్తుంది. అధిక మద్యపానం కూడా చర్మాన్ని పాడు చేస్తుంది. 

Image Credit : google

వ్యాయామం : వ్యాయామం రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని ఆక్సిజనేట్ చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. చర్మం నుంచి చెమట, బ్యాక్టీరియాను తొలగించడానికి వ్యాయామం చేసిన తర్వాత స్నానం చేయండి.

Image Credit : google

తగినంత నిద్ర :  మీ చర్మాన్ని రిపేర్ చేయడానికి, పునరుత్పత్తి చేయడానికి  7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల నల్లటి వలయాలు, నీరసం వస్తుంటుంది. వృద్ధాప్యానికి దారితీస్తుంది నిద్రలేమి.

Image Credit : google

ఒత్తిడి : దీర్ఘకాలిక ఒత్తిడి మొటిమలు, తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి ధ్యానం, యోగాలను చేయండి..

Image Credit : google