ఇండియన్‌.. ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో నివసిస్తున్న ప్రజలు.   ప్రపంచంలోని 195 దేశాల్లో భారతీయులు ఉన్నారు.

అయితే  భారతీయులు లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి.

వాటికన్‌ సిటీ.. వాటికన్‌ సిటీ ప్రపంచంలో అతి చిన్న దేశం. ఇది ప్రపంచవ్యాప్తంగా రోమన్‌ క్యాథలిక్‌ల ఆధ్యాత్మిక కేంద్రం.  ఇక్కడ ఒక్క భారతీయుడు కూడా నివాసం ఉండడం లేదు.

శాన్‌ మారినో.. రిపబ్లిక్‌ ఆఫ్‌ శాన్‌మారినో అని పిలుస్తారు. దేశం అన్నివైపులా ఇటలీ చుట్టముట్టి ఉంటుంది. ఇక్కడ జనాభా కేవలం 3,35,620. భారతీయులెవరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు.

టువాలు.. ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న దేశం టువాలు. ఇక్కడ కేవలం 10 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు.   ప్రస్తుతం ఇక్కడికి పర్యాటకులు కూడా రావడం లేదు.  ఇక్కడ భారతీయులు లేరు.

పాకిస్తాన్‌.. మన దాయాది దేశం పాకిస్తాన్‌. మన పొరుగు దేశమే అయినా భారతీయులెవరూ ఇక్కడ జీవనం సాగించడం లేదు. ఇందుకు కారణం భారత్‌ – పాకిస్తాన్‌ రోజుకో వివాదం నెలకొనడమే.  భారతీయువెలవరూ ఇక్కడకు వెళ్లడం లేదు.

బల్గేరియా.. బల్గేరియా ఆగ్నేయ ఐరోపాలో ఉన్న దేశం ఇది.  2019 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా 69,51,482. చాలా మంది క్రైస్తవాన్నే పాటిస్తున్నారు. ఇక్కడ కూడా భారతీయులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు.

Off-white Banner

Thanks For Reading...