టీమిండియా కప్ కొట్టింది. 17 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించి ఈసారి ఫైనల్ లో విజయం సాధించింది.

రోహిత్ : టీమిండియా ఫైనల్ చేరడంలో ప్రధాన పాత్ర రోహిత్ శర్మదే. అటు బ్యాట్ తో 257 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక స్కోరు చేశాడు.. ఇటు కెప్టెన్సీతో ఫైనల్ కు చేర్చాడు. 

బుమ్రా : పాకిస్తాన్ పై బుమ్రానే గెలిపించాడు. ఫైనల్ లో టీమిండియా గెలుపులో కీలకపాత్ర. కేవలం 4.17 ఎకానమీతో ఏకంగా 15 వికెట్లు తీశాడు.  అందుకే మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ దక్కింది. 

అక్షర్ పటేల్ : టోర్నీ ఆసాంతం పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తూ.. సెమీస్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొని ఫైనల్ లో 47 పరుగులు చేసి విజయంలో కీరోల్. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టాడు

హార్దిక్ పాండ్యా: టోర్నీ మొత్తం ఆల్ రౌండర్ గా అటు బౌలింగ్ లు, ఇటు బ్యాటింగ్ లో రాణించాడు. ఫైనల్ లో ఫైనల్ ఓవర్ వేసి రన్స్ ఇవ్వకుండా భారత్ ను గెలిపించాడు.

విరాట్ : టోర్నీ మొత్తం ఫెయిల్ అయ్యి ఫైనల్ లో తుదివరకూ ఉండి భారత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫైనల్ లో ఆడి         కప్ ను అందించాడు.

సూర్యకుమార్ : సెమీస్ లో ఇంగ్లండ్ పై 47 పరుగులు.. ఆస్ట్రేలియాపై 31 పరుగులతో దంచికొట్టి.. ఫైనల్ లో అద్భుత క్యాచ్ తో భారత్ కు కప్ ను అందించాడు.

అర్షదీప్ : టోర్నీలో ఫారూఖీతో కలిసి 17 వికెట్లతో అత్యధిక వికెట్ టేకర్ అర్షదీప్ నే.. కీలకసమయంలో వికెట్లు తీసి.. పొదుపుగా బౌలింగ్ చేసి భారత్ గెలుపుల్లో కీలక పాత్ర.