నభా నటేష్ కెరీర్ అనూహ్యంగా తారుమారైంది. ఈ కన్నడ బ్యూటీ చేతిలో ఒక్క ఆఫర్ లేదు.
కనీసం వెబ్ సిరీస్లు వంటి డిజిటల్ కంటెంట్ ఆఫర్స్ కూడా రావడం లేదు.
2015లో నభా నటేష్ చిత్ర పరిశ్రమకు వచ్చింది. వజ్రకాయ ఆమె డెబ్యూ మూవీ. శివరాజ్ కుమార్ హీరోగా నటించారు.
ఇక తెలుగులో నన్ను దోచుకుందువటే చిత్రంతో అడుగుపెట్టింది. నన్ను దోచుకుందువటే మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ బ్రేక్ వచ్చింది.
ఇక ఆఫర్స్ లేని నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. తాజాగా డెనిమ్ స్కర్ట్, జాకెట్ ధరించి బోల్డ్ ఫోటో షూట్ చేసింది.
నభా తీరు చూసిన జనాలు ఆఫర్స్ కోసం అమ్మడు ఇలా తెగిస్తుందని అంటున్నారు.