దేశంలో చాలా ఆలయాలు రోజు తెరుస్తుంటారు. కానీ  సంవత్సరానికి ఒకసారి తీసేవి కూడా ఉన్నాయి.

హాసన్ కర్ణాటకలో ఓ ఆలయం సంవత్సరానికి ఒకసారి తెరుస్తారు. సంవత్సరం తరువాత కూడా ఏడాది కింద తయారు చేసిన ప్రసాదాలు చెడిపోకుండా ఉంటాయంటే ఆశ్చర్యకరమే.

నీటితో దీపం వెలిగించే దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఘడియ ఘాట్ లో మాతాజీ మందిర్ అమ్మవారి ఆలయంలో దీపం నీటితో వెలిగిస్తారట.. ఇప్పటికి కూడా ఈ ఆలయంలో దీపం అలాగే వెలుగుతుండటం దైవ సంకల్పమే

తన ప్రసాదం తానే తినే స్వామి ఇక్కడ స్వామి వారికి పెట్టిన ప్రసాదం ఆయనే తింటాడు. ఇది నిజంగా అద్భుతమే. కేరళలో ఒకటి ఇంకోటి బృందావనంలో రాధాకృష్ణ శయన ఆలయంలో ఈ వింత ఉంది.

పన్నెండేళ్లకోసారి.. దేశంలో పన్నెండేళ్లకోసారి తెరుచుకునే ఆలయం కూడా ఉంది.  పన్నెండేళ్ల కోసారి పిడుగు పడి అతుక్కునే దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజిలి మహదేవ్ ప్రాంతంలో ఉంది.

సంవత్సరానికోసారి.. సంవత్సరానికి ఒకసారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి. నాగాపురంలోని వేదనారాయణ దేవాలయం, కొల్లాపూర్ లోని లక్ష్మీదేవస్థానం, బెంగుళూరులోని గవిగంగాధర్ దేవస్థానం, అరసవెల్లిలోని సూర్యనారాయణ దేవాలయం, కడప జిల్లాలోని కోదండరామాలయం.

నిరంతరం నీరు ప్రవహించే దేవాలయాలు మహానంది, జంబకేశ్వర్, బుగ్గరామలింగేశ్వర్, కర్ణాటక కమండ గణపతి దేవాలయం, హైదరాబాద్ లోని బుగ్గ శివాలయం, బెంగుళూరులోని మల్లేశ్వర్, బెల్లంపల్లిలోని రాజరాజేశ్వరి ఆలయం, సిద్ధగంగా దేవాలయం ప్రాంతాల్లో ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

రంగులు మారే దేవాలయం ఉత్తరాయణం, దక్షిణాయవనంలో రంగులు మారే ఆలయం తమిళనాడులోని అతిశయ వినాయక దేవాలయం. తూర్పుగోదావరి జిల్లాలో పంచారామ సోమేశ్వరాలయం, పాపపుణ్యాలను బట్టి నీటిని తాకే శివగంగా ఆలయం.

విగ్రహాలు పెరుగుతున్న ఆలయాలు కాణిపాకం, యాగంటి బసవన్న, కాశీ తిలదండేవ్వర్, బెంగుళూరులోని బసవేశ్వర్, బిక్కవోలు లోని లక్ష్మీగణపతి ఆలయాలు ఎప్పుడు విగ్రహాలు పెరిగే వాటిలో ఉంటాయి.

పూరీలో.. పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంపై పక్షులు ఎగరవు. ఇది కూడా ఒక వింతే. గాలి కూడా వ్యతిరేక దిశలో వీస్తుంది. సముద్రం నుంచి గాలి దేవాలయం వైపు వీయాలి కానీ దానికి విరుద్ధంగా గాలి సముద్రం వైపు వీయడం ఇక్కడ ప్రత్యేకత.

Off-white Banner

Thanks For Reading...