https://oktelugu.com/

దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి? దీనికి కారణం తెలుసా?

దోమలు కుట్టడానికి కారణాలు

Image Credit : pexels

Image Credit : pexels

వర్షాకాలంలో దోమలు మరింత ఎక్కువ ఉంటాయి. ఇంతకీ ఈ దోమలు ఎందుకు ఎక్కువ నన్నే కుడుతున్నాయి నా చుట్టే ఉంటున్నాయి అనుకుంటున్నారా? అయితే దోమలు ఎక్కువగా కొందరిని ఎందుకు కుడుతాయో చూసేద్దాం.

Image Credit : pexels

మనం పీల్చే కార్బన్ డై ఆక్సైడ్ కు దోమలు ఆకర్షితులవుతాయి. ఎక్కువ ఊపిరి పీల్చుకునే వ్యక్తులు, పెద్ద వారు లేదా చురుకుగా ఉన్నవారిని దోమలు ఎక్కువ కుడుతాయట.

Image Credit : pexels

శరీరంలోని వేడికి, చెమటకు దోమలు ఆకర్షితులవుతాయి. మీరు వెచ్చగా లేదా ఎక్కువ చెమటతో ఉంటే, మీరు దోమ కాటుకు గురి అవుతారని గుర్తుపెట్టుకోండి.

Image Credit : pexels

మీ చర్మంపై ఉండే బ్యాక్టీరియా రకాలు, పరిమాణాలు కూడా దోమలను ఆకర్షిస్తుంటాయట. కొన్ని బాక్టీరియాలు దోమలను ఆకర్షించే వాసనలను ఉత్పత్తి చేస్తాయట.

Image Credit : pexels

 కొందరికి ‘o’ గ్రూప్ బ్లెడ్ ఉంటుంది. ఈ వ్యక్తులను దోమలు ఎక్కువ కుడుతుంటాయట.

Image Credit : pexels

చెమట, చర్మంలో ఉత్పత్తి చేసే కొన్ని రసాయనాల మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది దోమల ఆకర్షణను ప్రభావితం చేస్తుంది

Image Credit : pexels

గర్భిణీ స్త్రీలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను వదులుతుంటారు. అధిక శరీర ఉష్ణోగ్రతలను కలిగి ఉంటారు. దీని వల్ల దోమలు వీరిని ఎక్కువగా కుడుతుంటాయట.

Image Credit : pexels

లేత రంగుల కంటే నలుపు, నేవీ బ్లూ వంటి ముదురు రంగులు దోమలకు మరింత ఆకర్షణీయంగా నిలుస్తాయి

Image Credit : pexels

ఆల్కహాల్ తాగేవారిని దోమలు మరింత ఆకర్షిస్తాయి. బహుశా శరీర ఉష్ణోగ్రత, చెమట కూర్పులో మార్పుల వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

Image Credit : pexels

లేత-రంగు దుస్తులు ధరించడం చెమట పట్టకుండా చూసుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మీరు దోమ కాటు నుంచి బయటపడవచ్చు. 

Read more