గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తల్లిబిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

బిడ్డ ఆరోగ్యం కోసం అంటూ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొందరు చాలా జ్యూస్ లు తాగుతుంటారు.

ఇక ఈ సమయంలో బరువు పెరగడం కామన్. కానీ ఎక్కువగా పెరగకూడదు అంటారు నిపుణులు.

జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ ఎక్కువగా పెరుగుతారట.

4 నెలల్లో 10 కి.లో బరువు కూడా పెరిగే అవకాశం ఉందట. అంతకు మించి కూడా బరువు పెరగవచ్చట.

బేబీ రంగు, బేబీ బరువు కోసం అని చాలా మంది గర్భవతులు అధిక మొత్తంలో జ్యూస్ లు తాగుతారు.

క్యారేట్, బీట్ రూట్, యాపిల్ అంటూ అన్నీ రకాల జ్యూస్ లు అధికంగా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు వస్తాయి. దీని వల్ల కొవ్వు పెరిగి అధికంగా బరువు పెరుగుతారు. అందుకే లిమిట్ గా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.