మొలకలలో A, C, E, K విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియంతో ఎముకల ఆరోగ్యానికి అవసరం. ఇవే కాదు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.
Image Credit : google
విటమిన్లు : చాలా విటమిన్లు ఉండే ఈ మొలకలు రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. కొన్ని తిన్నా సరే ఫుల్ ప్రయోజనాలు.
Image Credit : google
మినరల్ బూస్ట్ : కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటాయి మొలకలు. ఎముక ఆరోగ్యాన్ని, కండరాల పనితీరును ప్రోత్సహిస్తాయి మొలకలు.
Image Credit : google
యాంటీఆక్సిడెంట్ : ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి.
Image Credit : google
గుండె ఆరోగ్యం : ఇందులో ఉండే అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించి.. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
Image Credit : google
జీర్ణక్రియ : మొలకల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. అందుకే మీ డైలీ డైట్ లో మొలకలను చేర్చుకోండి.
Image Credit : google
బరువు నిర్వహణ : తక్కువ కేలరీలు కానీ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో బరువు కంట్రోల్ లో ఉంటుంది.
Image Credit : google
ఎముకల ఆరోగ్యం : విటమిన్ కె, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఆరోగ్యకరంగా ఉంచుతాయి.
Image Credit : google