రెండు పతకాలు.. ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన మను భాకర్

పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 

Image Credit : Instagram

Image Credit : Instagram

ఇప్పటికే షూటింగ్ లో కాంస్య పతకాన్ని సాధించి భారత ఖాతాను తెరిచిన ఆమె.. పది మీటర్ల పిస్టల్ మిక్స్ డ్ టీం విభాగంలో సరబ్ జోత్ సింగ్ తో కలిసి కాంస్య పథకాన్ని సాధించింది. 

Image Credit : Instagram

మంగళవారం జరిగిన పోరులో దక్షిణకొరియా ద్వయం జుయీ లీ - వోన్షోలీ పై మను భాకర్ - సరబ్ జోత్ సింగ్ 16-10 పాయింట్లు తేడాతో ఘనవిజయం సాధించి, కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 

Image Credit : Instagram

ఈ రెండు పతకాలతో ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన తొలిభారత అథ్లెట్ గా మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 

Image Credit : Instagram

10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో మను భాకర్ ఇటీవల కాంస్య పతకాన్ని సాధించింది. 

Image Credit : Instagram

అంతేకాదు ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో ఏకంగా రెండు మెడల్స్ సాధించిన మూడవ భారత అథ్లెట్ గా మను భాకర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. 

Image Credit : Instagram

రెజ్లర్ సుశీల్, షట్లర్ పివి సింధు రెండు మెడల్స్ సాధించారు. మను తో కలిసి కాంస్య పతకాన్ని సాధించిన సరబ్ జోత్ సింగ్ కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్.

Image Credit : Instagram

మను, సరబ్ అద్భుతంగా షూటింగ్ చేసి భారత్ కు కాంస్య పతకం ఖాయం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.. సోషల్ మీడియాలో మను, సరబ్ ట్రెండింగ్లో కొనసాగుతున్నారు.