కేక్ ప్రతిసారి సాఫ్ట్ గా,  స్పాంజి మాదిరి రావాలంటే ఏం చేయాలి

మృదువైన మరియు మెత్తటి కేక్‌లను తయారు చేయడం కష్టంగా అనిపిస్తుందా?.. అందుకే కేక్ లను తయారు కూడా చేయడం లేదా?

Image Credit : pexels

Image Credit : pexels

కానీ సరైన చిట్కాలతో, మీరు ప్రతిసారీ సాఫ్ట్ కేక్ లను తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే..

Image Credit : pexels

గది ఉష్ణోగ్రత : గుడ్లు, వెన్న, పాలు  అన్నీ కూడా గది ఉష్ణోగ్రత వద్ద ఉండాలి.  ఇలా ఉండటం వల్ల పిండిని మిక్సింగ్ చేసినప్పుడు మృదువుగా ఉంటుంది. కేక్ లను కూడా మృదువుగా ఉంచుతుంది.

Image Credit : pexels

సరిగ్గా కలపడం : వెన్న చక్కెరను మంచిగా కలపాలి. వీటి మిక్సింగ్ బెటర్ గా ఉంటే పిండిలోపలికి గాలి వెళ్తుంది. దీంతో కేక్ బాగా పెరుగుతుంది. స్పాంజిగా మారుతుంది.

Image Credit : pexels

ఓవర్‌మిక్స్ చేయవద్దు : పిండిలో అన్ని కలిసేలా కలిపితే సరిపోతుంది.. అతిగా కలపడం వల్ల మందపాటి కేక్ తయారవుతుంది. ఎందుకంటే ఇది గ్లూటెన్‌ను ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంది. ఫలితంగా కావాల్సిన ఆకృతి రాదు.

Image Credit : pexels

సరైన ఉష్ణోగ్రత : మీ ఓవెన్‌ను ముందుగా వేడి చేసి, సరైన ఉష్ణోగ్రత వద్ద కేక్‌ను కాల్చండి. అతిగా బేకింగ్ చేసినా మీకు కేక్ సరిగ్గా రాదు.

Image Credit : pexels

మజ్జిగ : మజ్జిగ లో ఉండే అధిక ఆమ్లత్వం వల్ల పిండిలోని గ్లూటెన్‌ను వేరు చేస్తుంది. కాబట్టి కేక్ మెత్తగా ఉంటుంది. మీరు దానిని మెత్తగా చేయడానికి చిటికెడు బేకింగ్ సోడాను కూడా జోడించవచ్చు.

Image Credit : pexels

చూశారు కదా కేక్ ను స్పాంజిలాగ మృదువుగా తయారు చేసుకోవడం ఎలాగో..మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి..