ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్. మట్టి అనేదే కనిపించదు. అందుకే నగరాల్లో పచ్చదనం పర్యావరణం లేకుండా పోతోంది.

అయితే చాలా మంది ఇంట్లోనే మొక్కలు పెంచుతున్నారు. తక్కువ మెయింటనెన్స్ తో పెద్దగా మట్టి, సూర్యరష్మి, నీరు అవసరం లేకున్నా పెరిగే మొక్కలు కొన్ని ఉన్నాయి. ఆ ఆరు మొక్కల గురించి తెలుసుకుందాం.

1. పాము మొక్క ఈ మొక్కను ఈజీగా మెయింటేన్ చేయవచ్చు. ఇది ఇంట్లో పెట్టుకుంటూ ఎయిర్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది

2.స్పైడర్ మొక్క గార్డెనింగ్ కోసం ఎక్కువగా ఈ గడ్డి జాతి స్పైడర్ మొక్కను వాడుతారు

3.ఆరేకా పామ్ మొక్క ఇంట్లో అందం కోసం కొబ్బరి ఆకులను పోలి ఉంటే ‘ఆరేకా పామ్’లను షోకేజ్ కోసం పెట్టుకుంటారు

4.మనీ ప్లాంట్ ఇంట్లో ఇది ఉంటే డబ్బులు వస్తాయని.. ఎంత పెరిగితే అంత ఆదాయం అని మనీ ప్లాంట్ ను పెట్టుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఈ మొక్క ఉండాలంటారు.

5. పీస్ లిల్లీ పీస్ లిల్లీ అనే ఈ తెల్లటి పువ్వులు మీ ఇంట్లో ఆనందాన్ని పంచుతాయి. స్వచ్ఛంగా ఉంచేలా చేస్తాయి.

6. లక్కీ బాంబూ.. ఇదో గడ్డి జాతి షోకేజ్ మొక్క. ఆఫీసులు, కార్యాలయాల్లో టేబుల్స్ పై పెంచుతారు.