పక్కన ఎలాంటి సౌండ్ లు జరగకున్నా కూడా చెవిలో కొందరికి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వీటిని టినిటస్ అంటారు.

చెవిలో ఉండే కాక్లియర్ పెటాలజీ, కాక్లియర్ సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల వినికిడి శబ్దం తగ్గుతుందట.

ఈ సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల కొన్ని సార్లు చెవిలో నొప్పి రావడం, చెవిలో గుమ్ మనే శబ్దాలు వస్తుంటాయి.

వెస్టిబ్యూలర్ న్యూరైటిస్ వల్ల కూడా చెవిలో గుమ్ మనే శబ్దాలు వినిపిస్తాయి అంటున్నారు నిపుణులు.

దీనికి సంబంధించిన కొన్ని టెస్టులు చేయడం వల్ల చెవిలో ఉన్న సమస్యలు తెలిస్తాయి.

సమస్య తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన మందులు వాడటం వల్ల ఈ సమస్య తగ్గుతుందని సలహా ఇస్తున్నారు నిపుణులు

సమస్య తీవ్రత తక్కువగా ఉంటే యోగా, మెడిటేషన్ వల్ల కూడా తగ్గించవచ్చు.

బ్లూటూత్, హెడ్ సెట్ వంటివి వాడే అలవాటు ఉంటే మాత్రం కచ్చితంగా మానాల్సిందే అంటున్నారు నిపుణులు.