వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. చర్మం సాగుతూ, జుట్టు ఊడిపోతూ ఉంటుంది.

ముందు నుంచే సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వృద్ధాప్య ఛాయల నుంచి కాస్త దూరంగా ఉండవచ్చు.

క్యాబేజీ, వెల్లులిలను తింటూ.. సిట్రస్ పండ్లను కూడా మీ డైట్ లో చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు యవ్వనంగా కనిపిస్తారు.

విటమిన్ ఇ: దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్ గా పిలుస్తారు కూడా. ఈ విటమిన్ నిత్య యవ్వనంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.

సన్ ఫ్లవర్ లో విటమిన్ ఇ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి వీటి గింజలు తినడానికి ప్రయత్నించండి.

అల్లం, సోయా, కాలీఫ్లవర్ లు కూడా మీ వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.

నీరును ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.

నీటి శాతం ఉండే పండ్లను తీసుకోవడం వల్ల కూడా మీరు వృద్దాప్య ఛాయల నుంచి బయటపడవచ్చు.