తండ్రి కొడుకుల బంధం గురించి ఎంతచెప్పినా తక్కువే. వీరి గురించి తెలిపే అద్భుతమైన సినిమాల లిస్ట్ ఇదిగో..

నాన్నకు ప్రేమతో.. నాన్న పరువు కోసం కొడుకు పడే కష్టం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మెరిసింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో నటించారు.

హాయ్ నాన్న: హీరో నాన్ని మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. గతం మర్చిపోయిన భార్యను కొన్ని సంఘటనల వల్ల ఆమెకు దూరంగా ఉంటూ కూతురు కోసం తన జీవితాన్ని బాధగా గడిపేస్తుంటాడు హీరో. ఈ సినిమా కూడా చాలా మందిని కంటతడి పెట్టించింది.

యానిమల్: ఈ సినిమా విమర్శలను మూటగట్టుకున్నా సూపర్ హిట్ గా నిలిచింది. తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు అనే నేపథ్యంలో వచ్చింది సినిమా. ఇందులో రణబీర్ కపూర్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

విమానం: ఈ సినిమా చాలా మందిని కంటతడి పెట్టిస్తుంది. సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ నటించిన ఈ సినిమాను శివప్రసాద్ యానాల తెరకెక్కించారు. కొడుకు విమానం ఎక్కాలనే మొండి కోరికను ఎలాగైనా తీర్చాలని తండ్రి చేసే కష్టం ఏడిపిస్తుంది.

 కురంగు పెడల్: 1980 బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఈ సినిమాలో ఎలాగైనా సరే సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ కొడుక్కి సైకిల్ నడపడం రాని అతని తండ్రి తన కొడుకుకు ఎలా సైకిల్ నడిపించడం నేర్పించాడు అనేది సినిమా. ఈ క్రమంలో తండ్రి కొడుకులు ఎదుర్కున్న ఎమోషనల్ సీన్స్ సూపర్ గా ఉన్నాయి.

Off-white Banner

Thanks For Reading...