"భూమి విశాలంగా ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉంటుంది. ఇవి రెండు కలిసే అవకాశం లేదు." చిన్నప్పుడు పాఠశాలల్లో ఇలానే కదా ఉపాధ్యాయులు చెప్పేవారు.

"భూమి, ఆకాశం కలుస్తాయని" చదువుకోలేమో. ఎందుకంటే ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు పరిశీలన జరపగా భూమి, ఆకాశం కలుస్తాయని తేలింది.

 భూగర్భ శాస్త్ర నిపుణుల అధ్యయన ప్రకారం ఐరోపాలో చివరి రోడ్డు ఉందని తెలిసింది.

అక్కడ భూమి, ఆకాశం కలుస్తాయట. ఇక్కడితో ప్రపంచ రహదారి మార్గం ముగుస్తుందట.

ఐరోపాలోని E -69 హైవే చివరి రహదారి చిరునామా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని ప్రపంచపు రోడ్డు చివరి అంచు అని తేల్చారు.

ఈ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లడానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు..

నార్వే ప్రాంతంలోని E-69 హైవే చివరి అంచుకు వెళ్తే సముద్రం కనిపిస్తుంది. ఈ రహదారి భూమి అంచున ఉంది.

ఇక్కడ విరుద్ధమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో  బతకడం చాలా కష్టం.

ఉత్తరార్థ గోళంలో ఉండటంతో విపరీతంగా మంచు కురుస్తూనే ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో ఉంటాయి.  మనుషులు బతకడం చాలా కష్టం.

Off-white Banner

Thanks For Reading...