Images source: google
భారతదేశం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కొన్ని తేయాకు తోటలకు నిలయం. ప్రత్యేకమైన రుచులు, సుందరమైన అందాలను అందిస్తోంది. దేశంలోని ఉత్తమ టీ తోటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Images source: google
డార్జిలింగ్ టీ ఎస్టేట్‌లు, తరచుగా "షాంపైన్ ఆఫ్ టీస్"గా సూచిస్తుంటారు. సుగంధమైన టీ అందిస్తాయి ఇక్కడి తోటలు. గ్లెన్‌బర్న్, మకైబారి, హ్యాపీ వ్యాలీ వంటి ఎస్టేట్‌లు సందర్శకులకు ప్రసిద్ధ గమ్యస్థానాలు కూడా.
Images source: google
అస్సాం టీ తోటలు బలమైన బ్లాక్ టీని ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందాయి. హల్మారి, మనోహరి, జోర్హాట్ వంటి ఎస్టేట్‌లతో ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద టీ-తోటలున్న ప్రాంతంగా నిలిచింది.
Images source: google
కేరళలోని మున్నార్ తేయాకు తోటలు దేశంలోని అత్యుత్తమ ఆర్గానిక్, హెర్బల్ టీలను ఉత్పత్తి చేస్తాయి. కొలుక్కుమలై, కన్నన్ దేవన్, సెవెన్మల్లయ్ వంటి ఎస్టేట్‌లు తప్పక సందర్శించాలి.
Images source: google
నీలగిరి టీ ఎస్టేట్‌లు సువాసనగల టీని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాంతంలోని కొన్ని టాప్ టీ ఎస్టేట్‌లలో గ్లెన్‌డేల్, టైగర్ హిల్, చామ్‌రాజ్ చోటు సంపాదించాయి.
Images source: google
పశ్చిమ బెంగాల్‌లోని డోర్స్ టీ తోటలలో అధిక-నాణ్యతగల బ్లాక్, గ్రీన్ టీలు ఉత్పత్తి అవుతాయి. గోరుమర, రంగమతి, మల్బజార్ వంటి ప్రముఖ ఎస్టేట్‌లు పచ్చని తేయాకు తోటలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
Images source: google
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాంగ్రా తేయాకు తోటలు విభిన్న ఆకుపచ్చ, నలుపు టీలకు ప్రసిద్ధి చెందాయి. పాలంపూర్, వా, దరాంగ్ వంటి తేయాకు తోటలు సుందరమైన ధౌలాధర్ పర్వత శ్రేణులలో ఉన్నాయి.
Images source: google