భారతదేశం అనేక ఎత్తైన దేవాలయాలకు నిలయం. ఈ తీర్థయాత్రలలో కొన్ని చేరుకోవడం కష్టంగా ఉండటమే కాకుండా అనేక అడ్డంకులు కూడా దాటుకొని వెళ్లాలి.

Image Credit : google

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న హేమకుండ్ సాహిబ్ గురుద్వారా ఆలయానికి వెళ్లాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ ఆలయం చుట్టూ మంచుతో కప్పబడిన శిఖరాలు, సహజమైన సరస్సు ఉంటాయి

Image Credit : google

తుగ్నాథ్ ఆలయం కూడా ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఒక పర్వత క్షేత్రం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం.

Image Credit : google

యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో యమునా నదికి మూలమైన యమునా దేవి కొలువు దీరింది.

Image Credit : google

జమ్మూకాశ్మీర్ లోని అమర్‌నాథ్ గుహ దేవాలయం సహజంగా ఏర్పడిన మంచు లింగానికి ప్రసిద్ధి చెందింది. యాత్రికులు ఇక్కడికి వెళ్లాలంటే పెద్ద సవాలే.

Image Credit : google

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని శివునికి అంకితం చేశారు. చార్ ధామ్‌లలో ఒకటి ఈ మందిరం.

Image Credit : google

వైష్ణో దేవి ఆలయం, జమ్మూకాశ్మీర్ లోని కత్రాలో ఉంది, ఈ ఆలయాన్ని వైష్ణవి దేవికి అంకితం చేశారు. ఈ టెంపుల్ కు చాలా ప్రత్యేకత ఉంది.

Image Credit : google

ఉత్తరాఖండ్‌లోని కార్తీక స్వామి ఆలయంలో శివపార్వతుల కుమారుడు కార్తికేయుడు కొలువు దీరాడు.

Image Credit : google