Images source: google
ప్రతి వంటగదిలో ఉంటుంది వెల్లుల్లి. కూరలకు రుచిని పెంచడం మాత్రమే కాదు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Images source: google
రోగనిరోధక శక్తి: వెల్లుల్లి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఇందులో విటమిన్ సి, సల్ఫర్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల జలుబుకు దూరంగా ఉండవచ్చు.
Images source: google
బరువు: వెల్లుల్లి తినడం వల్ల బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే అలిసిన్ వెయిట్ లాస్ కు సహాయం చేస్తుంది.
Images source: google
మెటబాలిజం: వెల్లుల్లిని ఉదయం పరిగడుపున తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Images source: google
వెల్లుల్లి + నిమ్మరసం: వెల్లుల్లిని నిమ్మరసంతో తింటే కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో వెల్లుల్లి ముక్కలను, నిమ్మరసాన్ని వేసి తాగండి. దీని వల్ల జీవక్రియ మెరుగు అవుతుంది.
Images source: google
వెల్లుల్లి నీరు: వెల్లుల్లి నీరు కూడా బరువు తగ్గిస్తుంది. వెల్లుల్లిని నీళ్లలో వేసి కొద్ది సేపు మరిగించి ఆ నీటిని తాగాలి. దీని వల్ల కేలరీలు కరుగుతాయి.
Images source: google
వెల్లుల్లి+తేనె: బరువు తగ్గడానికి వెల్లుల్లిని తేనెతో కలిపి తీసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో 2-3 వెల్లుల్లి ముక్కలను వేయాలి. ఈ నీటిని తేనెతో కలిపి తీసుకోవాలి. దీని వల్ల పొట్ట తగ్గుతుంది.
Images source: google