Image Credit : pexels
Image Credit : pexels
మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ : మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ చేయడం వల్ల విశ్రాంతి, మానసిక ఆనందం మీ సొంతం అవుతుంది. అంతేకాదు స్ట్రెస్ అనిపించదు.
Image Credit : pexels
వ్యాయామం : శారీరక శ్రమ ప్రతి ఒక్కరికి అవసరం. ఇలా చేయడం వల్ల సహజ ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్‌లను విడుదల అవుతాయి. మానసిక స్థితి మెరుగుపడుతుంది. అందుకే ప్రతి రోజు వ్యాయామం చేయాలి.
Image Credit : pexels
సమయం నిర్వహణ : ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్‌మెంట్ వల్ల మీ బాస్ లు ఇచ్చిన ఎలాంటి టాస్క్ లను అయినా మీరు ఇన్ టైమ్ లో పూర్తి చేస్తారు. తద్వారా చివరి నిమిషంలో కూడా ఒత్తిడి ఉండదు.
Image Credit : pexels
శ్వాస వ్యాయామాలు : లోతైన శ్వాస పద్ధతులు త్వరగా మనస్సును ప్రశాంతపరుస్తాయి. శారీరక ఒత్తిడి ప్రతిస్పందనలను తగ్గిస్తాయి.
Image Credit : pexels
పని-జీవిత సంతులనం : పని, వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలన్స్ చేసుకోవడం వల్ల మనశ్శాంతిగా ఉంటుంది. స్ట్రెస్ గా అనిపించదు.
Image Credit : pexels
సామాజిక మద్దతు : సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడం వల్ల భావోద్వేగ మద్దతు లభిస్తుంది. ఒంటరిగా ఉన్న భావాలను తగ్గిస్తుంది.
Image Credit : pexels
వృత్తిపరమైన కౌన్సెలింగ్ : థెరపిస్ట్ లేదా కౌన్సెలర్ నుంచి సహాయం కోరడం వల్ల దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇలాంటివి మీకు సమర్థవంతమైన వ్యూహాలను అందిస్తాయి.
Image Credit : pexels
తగినంత నిద్ర : ప్రతి మనిషికి తగినంత నిద్ర అవసరం. శరీరం ఒత్తిడి నుంచి కోలుకోవడానికి, మీ పనితీరును మెరుగు పరచడంలో సహాయం చేస్తుంది..