వర్షాలు కురుస్తుంటే వేడి వేడిగా ఏవైనా తినాలి అనిపిస్తుంది. అందుకే ఈ మోమోలతో ఎంజాయ్ చేయండి. అవేంటో ఓ సారి చూసేయండి.

చికెన్ మోమో దీన్ని మాంసాహారులు చాలా ఇష్టపడతారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, సోయా సాస్  సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి గ్రౌండ్ చికెన్‌తో తయారు చేస్తే సూపర్ గా ఉంటుంది.

పనీర్ మోమో ఈ ప్రోటీన్-రిచ్ మోమో సన్నగా తరిగిన కూరగాయలు, వెల్లుల్లి, అల్లం, మసాలాలతో కలిపి పనీర్ తో తయారు చేస్తారు. టేస్ట్ అదిరిపోతుంది. 

బచ్చలికూర, చీజ్ మోమో ఈ మోమోలను పిల్లలు చాలా ఇష్టపడతారు, ఈ మోమో చీజ్, వెల్లుల్లి, మిరియాలు, ఉప్పుతో కలిపి మసాలా మాదిరి చేసి బచ్చలికూర ఆకులతో తయారు చేస్తారు.

రొయ్యల మోమో దీన్ని తయారు చేయడానికి వెల్లుల్లి, అల్లం, సోయా సాస్, కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయలు కావాలి. ఇంకా రొయ్యలు కూడా. వీటిని కూడా చాలా మంది ఇష్టపడతారు.

టోఫు మోమో ఈ ప్రోటీన్-రిచ్ మోమో సన్నగా తరిగిన కూరగాయలు, వెల్లుల్లి, అల్లం, సోయా సాస్‌తో కలిపి చేస్తారు. టోఫు కూడా కావాల్సిందే.

కీమా మోమో ఈ మోమోను ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, మసాలా దినుసులతో కలిపి గ్రౌండ్ లాంబ్‌తో తయారు చేస్తారు.

మొక్కజొన్న, బచ్చలికూర మోమో ఈ ఆరోగ్యకరమైన మోమోను తయారు చేయడానికి, ఉడికించిన స్వీట్ కార్న్, బచ్చలికూర అవసరం. వీటిని ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, మసాలా దినుసులతో తయారు చేసుకోవాలి.