కొన్ని జంతువులు ఎదురైతే అరిష్టంగా భావిస్తారు కొందరు. కానీ కొన్ని జంతువులను ఇంట్లో పెంచుకుంటే లక్ అంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటంటే..

చైనీయులు గోల్డ్ ఫిష్ ను లక్ గా భావిస్తారట. దీన్ని సంపదకు కూడా సంకేతంగా అనుకుంటారట.

హిందూ సంప్రదాయంలో ఏదైనా పనికి వెళ్ళే ముందు నల్లపిల్లి కనిపిస్తే దురదృష్టంగా, కీడు సంభవిస్తుందని నమ్ముతారు. జపాన్ లో నల్ల పిల్లిని అదృష్టంగా భావిస్తారు.

ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు కుక్కలు ఎదురైతే కూడా వెంటనే మంచి జరుగుతుందట. అంతేకాదు పాలిచ్చే కుక్కలు  ఎదురైతే శుభప్రదంగా కూడా భావిస్తారు.

అరొ వానా ఫిష్ ను కూడా లక్కీగా శ్రేయస్సును ప్రసాదించేదిగా భావిస్తారట. దీన్ని సంపద ప్రసాదించేదిగా కూడా నమ్ముతారట.

తాబేలును కూడా లక్కీగా భావిస్తారు కొందరు. ముఖ్యంగా చైనా, జపాన్ లో తాబేలును దీర్ఘాయువును, శ్రేయస్సును ప్రసాదించేదిగా భావిస్తారట.

ప్రేమపక్షులు.. రామచిలుక వంటి ప్రేమపక్షులను రెండింటిని కలిపి పెంచుకుంటారు. వీటి వల్ల ఇంట్లో ప్రేమ, ప్రశాంతత, పాజిటివిటీ, హెల్దీ రిలేషన్ ఉంటాయని నమ్ముతారట.

ఆవును కూడా చాలామంది లక్కీగానే భావిస్తారు. ఏ పనికి వెళ్ళేముందు అయినా ఆవు కానీ దూడ కానీ ఎదురు వస్తే కచ్చితంగా ఆ పని అవుతుందని నమ్ముతారు