జుట్టు రాలడం ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. మరి దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా?

కేవలం వంటింట్లో ఉండే ఉల్లిపాయ వల్ల మీ జుట్టుకు మంచి ఆరోగ్యం అందుతుంది. ఇంతకీ దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోండి.

ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు సమస్యలను తొలిగిస్తుంది. తద్వారా  జుట్టు పెరుగుతుంది.

మరి జుట్టు సంరక్షణ కోసం ఈ ఉల్లిపాయను ఎలా ఉపయోగించవచ్చో ఓ సారి చూసేద్దాం.

ఉల్లిపాయ హెయిర్ ప్యాక్ : ఉల్లిపాయను కోసి దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి స్కాల్ప్, కు అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, మంచి షాంపూతో కడగాలి.

ఉల్లిపాయ రసం : రెండు ఉల్లిపాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి. దీన్ని పేస్ట్ చేసి.. తల స్నానానికి ముందు ఉల్లిపాయ రసాన్ని మీ జుట్టుకు పట్టించండి. 

ఆనియన్ హెయిర్ ఆయిల్ స్ప్రే :  ఉల్లిపాయ రసం తీసి స్ప్రే బాటిల్‌లో పోయాలి. మీ జుట్టు మీద స్ప్రే చేసే ముందు దానికి నూనెను కలిపి షేక్ చేయండి. హెయిర్ వాష్‌కు 1 గంట ముందు ఈ ద్రవాన్ని మీ జుట్టుకు స్పే చేయండి. 

చికాకు లేదా మంట అనిపిస్తే.. వైద్యులను సంప్రదించాలి. కూరగాయల ఎలర్జీ ఉంటే దీన్ని పెట్టుకోవడం మానేయాలి.