చరిత్రకు నిర్మాణమే సాక్ష్యం. పరిపాలనకు కట్టడమే సాక్షి భూతం. ఈ ప్రపంచంలో ఆయా దేశాల నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించే నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇందులో భారతదేశం తక్కువేమీ కాదు. ముఖ్యంగా 21వ శతాబ్దంలో అద్భుతం, ఆశ్చర్యం కలగలిపిన నిర్మాణాలను సాకారం చేసుకుంది. ఇంతకీ ఆ నిర్మాణాలు ఏంటంటే..

అటల్ టన్నెల్, హిమాచల్ ప్రదేశ్: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ సొరంగాన్ని నిర్మించారు. ఈ సొరంగం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీనికి అటల్ టన్నెల్ అని పేరు పెట్టారు. దీనిని పూర్తిచేసేందుకు 10 సంవత్సరాలు కాలం పట్టింది.. 2020 అక్టోబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు.

చీనాబ్ వంతెన, జమ్ము కాశ్మీర్: చీనాబ్ నది మీద నిర్మించిన అతి పెద్దదైన వంతెన ఇది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది.1. 315  కిలోమీటర్ల ఎత్తైన ఇనుప స్తంభాల ఆకృతి పై ఈ వంతెన నిర్మించారు. ఇది జమ్మూ కాశ్మీర్లో రెండు ప్రాంతాలను కలుపుతుంది.

అటల్ సేతు, మహారాష్ట్ర: అటల్ సేతు భారతదేశంలోనే అతి పొడవైన వంతెన. సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెన కూడా ఇదే. ఇది ఆరు వరసల్లో విస్తరించి ఉంది. 21.8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సముద్రంపై 16.5 కిలోమీటర్లు, భూమిపై 5.3 కిలోమీటర్లు పరిధిలో ఈ వంతెనను నిర్మించారు.

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ: గుజరాత్ రాష్ట్రంలోని కె వాడియా ప్రాంతంలో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యాం సమీపంలో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించారు. దేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మించారు. ఈ విగ్రహం 537 అడుగుల ఎత్తులో ఉంది.

పాంబన్ వంతెన, తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలో కొత్త పాంబన్ వంతెన ప్రధాన భూభాగంతో రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతుంది. ఇది 72 మీటర్ల విస్తీర్ణంతో భారతదేశంలోనే మొట్టమొదటి నిలువు - లిఫ్ట్ వంతెనగ పేరు గడిచింది. ఈ వంతెన పొడవైన ఓడలు సముద్రం దాటేందుకు వీలు కల్పిస్తుంది.

Off-white Banner

Thanks For Reading...