ట్రెడిషన్ లుక్కులో అందరినీ ఫిదా చేస్తున్న శివదా..!

సంప్రదాయ చీరకట్టులో శివదా ఆకట్టుకుంది. దీపాలు వెలుగిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న పలు ఫొటోలను శివదా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. శివదా విషయానికొస్తే.. ఆమె ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తుంది. 

2009 ‘కేరళ కేఫ్‌’ అనే మలయాళ చిత్రంలో చిన్న పాత్ర చేసింది. 

ఆ తర్వాత చాలా కాలం టెలీవిజన్ ఛానెల్ ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా పనిచేసింది.

ఆ సమయంలో ఆమె మలయాళ దర్శకుడు ఫాజిల్ దృష్టిలోపడి 2011లో ‘లివింగ్ టుగెదర్‌’లో మహిళా ప్రధాన పాత్ర పోషించడం ద్వారా తిరిగి సినిమా రంగంలో అడుగు పెట్టింది.

ఆ తర్వాత తమిళ చిత్రం ‘నెడుంచాలై’లో నటించడంతో పాటు చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం బీజీగా స్టార్ గా మారిపోయింది.

ఆమె తన చిరకాల ప్రియుడు మురళీ కృష్ణన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది.