సంతృప్తికరమైన, శాశ్వతమైన వైవాహిక సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Image Credit : google

సమర్థవంతమైన కమ్యూనికేషన్ : ఓపెన్, నిజాయితీ గా మాట్లాడటం, సానుభూతితో కూడిన కమ్యూనికేషన్ వల్ల వివాహబంధం బలంగా ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. 

Image Credit : google

నాణ్యమైన సమయం : నాణ్యమైన సమయం అంటే పక్క పక్కన కూర్చొని ఫోన్ పట్టుకోవడం కాదు. ఒకరితో ఒకరు ఇష్టంగా మాట్లాడుకోవడం, సంతోషంగా గడపడం. మంచి సంభాషణ ఉండాలి.

Image Credit : google

గొడవలు : గొడవలు జరగడం కామన్. కానీ వాటిని ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. దీనివల్ల మీ రిలేషన్ దెబ్బతినదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా అర్థం చేసుకోవాలి.

Image Credit : google

ఎమోషనల్ సపోర్ట్ : ఎలాంటి సందర్భంలో అయినా మీ భాగస్వామికి మీ సపోర్ట్ ఉంటుందే నమ్మకం కలిగించాలి. నమ్మకం రిలేషన్ ను మెరుగుపరుస్తుంది.

Image Credit : google

లక్ష్యాలు,విలువలు : భాగస్వామి వ్యక్తిగత, భాగస్వామ్య లక్ష్యాలకు విలువ ఇవ్వాలి. వారి లక్ష్యం గురించి అర్థం చేసుకొని వారికి సపోర్ట్ గా నిలవాలి. మీ మద్దతు వారికి అవసరం అని గుర్తించండి.

Image Credit : google

కృతజ్ఞత, ప్రశంసలు : ఒకరికొకరు కృతజ్ఞత,  ప్రశంసలను వ్యక్తం చేయడం కీలకం. ఎలాంటి సందర్భంలో అయినా ప్రశంసలను మర్చిపోవద్దు. ప్రతిరోజు పని గట్టుకొని కూడా ప్రశంసించవద్దు. సందర్భంలో మాత్రం ప్రశంసించాల్సిందే.

Image Credit : google

క్షమాపణ : క్షమించాలి.. క్షమించమని అడగాలి. తప్పు చేసినప్పుడు క్షమించే గుణం మీలో ఉంటే భాగస్వామి ఆనంద పడతారు. ఇక మీరు తప్పు చేసినా సరే క్షమించమని అడగాలి. ఇద్దరు ఈ ఫీలింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆ రిలేషన్ బాగుంటుంది. 

Image Credit : google