మీరు ఇప్పుడే యోగాను ప్రారంభించాలి అనుకుంటే ఈ ఆసనాలను తెలుసుకోండి.

త్రికోణాసన : త్రిభుజాకారంలో ఉండే ఈ త్రికోణాసనం వేయడం వల్ల జీర్ణం సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, నడుము నొప్పి తగ్గి.. భౌతికంగా, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవుతారట. కాళ్లు, నడుము నొప్పులు, గుండె సమస్యలు ఉంటే మాత్రం ఈ ఆసనాను వేయకూడదు.

వృక్షాసన: చెట్టు మాదిరి ఉండే ఈ ఆసన కాళ్లలో బలాన్ని తెస్తుంది. మడమలను స్ట్రాంగ్  చేస్తుంది. కాళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనాలను వేయకూడదు.

అర్ధమత్స్యేంద్రాసన: ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ను పంపడంలో ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. గర్భవతులు, నడుము కింద భాగంలో నొప్పి ఉన్నవారు మెడ నొప్పులు ఉన్నవారు ఈ ఆసన వేయకూడదు.

బద్దకోణాసన: దీన్ని బటర్ ఫ్లై పోజ్ అని కూడా అంటారు. బ్లాడర్ సమస్యలు, నెలసరి సమస్యలు తొలగిస్తుంది. గర్భిణీలు తమ మొదటి మూడు నెలలు ఈ ఆసనాను వేయకూడదు.

వజ్రాసన: జీర్ణ సమస్యలను తొలగిస్తుంది వజ్రాసన. మోకాలు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనాను వేయకూడదు.

అధో:ముఖాసన: ఈ ఆసనాను డాగ్ ఫోజ్ అంటారు. దీని వల్ల మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తలనొప్పి కూడా మాయం అవుతుంది. గర్భవతులు తమ మొదటి మూడు నెలల సమయంలో ఈ ఆసనాను వేయకూడదు.

ధనురాసన: ఈ ఆసన వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీన్ని మెడ నొప్పి, నడుము నొప్పులు ఉన్నవారు చేయకూడదు.