ప్రస్తుతం చాలా జంటలు విడాకుల వరకు వెళ్తున్నాయి. చిన్న గొడవలకే విడిపోవాలి అనుకుంటున్నారు.

విడిపోకుండా ఉండాలంటే.. పిల్లలు కూడా బాగుండాలంటే ఏం చేయాలో ఓ సారి తెలుసుకోండి.

అహంకారం:  ఒకరి మాట ఒకరు వినడానికి ఇష్టపడటం లేదు. అహంకారం వల్ల ఇగొ వల్ల గొడవలు మరింత ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టాలి.

అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి.. ఒకరితో ఒకరికి డబ్బు విషయంలో పెద్దగా అవసరం రావడం లేదు. అందుకే ఒకరికి ఒకరు మర్యాద కూడా ఇవ్వడం లేదు. సో థింక్

పిల్లలు కూడా:  ఇంట్లో తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా వారిలాగే తయారు అవుతున్నారు. వారి కోసం అయినా మీరు మారాల్సిందే.

సర్దుబాటు: ఎన్ని గొడవలు వచ్చినా సర్దుబాటు చేసుకోవడం వల్ల మీ సంసారం బాగుంటుంది. ఇద్దరు కూడా సర్దుబాటును అలవర్చుకోవాలి.

త్యాగం చేయడం వల్ల ఎదుటి వారు చాలా సంతోషంగా ఉంటారు. దీని వల్ల మీ మీద గౌరవం, ప్రేమ కూడా పెరుగుతుంది. కానీ దేన్ని త్యాగం చేయాలో తెలుసుకోవాలి.  

అర్థం చేసుకోవడం: ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తప్పులను ఎత్తి చూపిస్తుంటే గొడవలు జరుగుతాయి కానీ తగ్గవు. సో అర్థం చేసుకోవాలి.